Friday, May 3, 2024

హ్యాట్రిక్ కోసం బాలయ్య, అల్లు అర్జున్ ఆరాటం

కరోనా సెకండ్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. అగ్ర హీరోలు సైతం షూటింగ్ లో పాల్గొనడానికి ఆలోచిస్తున్నారు. అయితే బాలయ్య అల్లు అర్జున్ మాత్రం వెనుకడుగు వేయలేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

అటు బన్నీ సుకుమార్ కు ఇటు బాలయ్య బోయపాటి కి ఇది హ్యాట్రిక్ సినిమా. ఇప్పటివరకు అయితే ఈ రెండు చిత్రాలు షూటింగ్ ని ఆపలేదు. మరి త్వరలో అవుతారో లేక కంప్లీట్ చేస్తారో కాలమే నిర్ణయించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement