Thursday, May 16, 2024

కొనసాగుతున్న కరోనా టీకా పంపిణీ …

బిజినేపల్లి : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నియంత్రణలో విశేషంగా కృషి చేస్తున్న తీరులో భాగంగా కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని బిజీనపల్లి మండల జిల్లా పరిషత్ టెరిటోరియల్ సభ్యుడు టి.హరిచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు.మండలంలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాధి నిరోధక టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలు కరోనా వ్యాధికి భయబ్రాంతులకు గురి కాకుండా.. వ్యాధి సోకకుండా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ ని అర్హులైన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు.
బయట ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని, చేతి శుభ్రత పాటించాలని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించారాదని ఆయన సూచించారు. టీకాలు తీసుకోవడానికి స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ,మహిళా మండలి సభ్యులు, అధికారులు తమ పరిధిలోని వారిని ప్రోత్సహించి, టీకాలు వేయించి, కరోనా నుంచి బయటపడేలా చేయాలని తెలిపారు.లట్టుపల్లి చిన్నపిల్లల వైద్యాధికారి డాక్టర్ ఎస్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం 1050 డోసులు అందుబాటులో ఉన్నాయని ..ఈ ప్రాంత ప్రజలు గిరిజన వాసులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మంగనూర్రు గ్రామ సర్పంచ్ కొత్తకోట రంగమ్మ, వైద్యాధికారి డాక్టర్ ఎస్ రాజేష్ గౌడ్, ఆరోగ్య సిబ్బంది కే కిష్టమ్మ, యాదగిరి, నగేష్ సలీం, జ్యోతి ,హెలెన్,దివ్య,చంద్రశేఖర్, అంగన్వాడీ కార్యకర్త నస్రీన్ బేగం ,ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి నిర్మల,లక్ష్మి, విజయమ్మ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement