Saturday, May 4, 2024

గద్వాల కలెక్టర్ క్రాంతిని స‌న్మానించిన ఎమ్మెల్యే, మున్సిప‌ల్ చైర్మ‌న్

జోగులాంబ గద్వాల, ప్రభ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతనంగా నిర్మాణమైన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.. కేసీఆర్ సమక్షంలో బాధ్యతలను స్వీకరించడం జరిగింది. సోమవారం గద్వాల జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కె.టి దొడ్డి మండలం పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, కురుమన్న పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement