Thursday, May 2, 2024

TS : ఆరు గ్యారెంటీలు అమల‌య్యే దాక వెంటాడుతాం … డీకే అరుణ

మక్తల్, ఏప్రిల్7(ప్రభన్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంటామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అధ్యక్షతన జరిగిన మక్తల్ పట్టణ, మక్తల్ మండల బూత్ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

- Advertisement -

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పారు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు .రూ్ 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు? నెలకు పెన్షన్ రూ.4000 ఇస్తామన్నారు ఇచ్చారా ?ఇంటికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు ఇచ్చారని ఆమె ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.రైతు బరోస అమలు కాలేదు రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో బస్సులు లేక కొట్టుకునే పరిస్థితిలు ఏర్పరిచారని ఆమె అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏం ముఖం పెట్టుకొని లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని దేశం కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.పార్టీ గెలుపు కోసం పాటుపడాలన్నారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒకరికి ఐదు కేజీల బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని అన్నారు.రానున్న మరో ఐదేళ్లపాటు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత బియ్య అందజేస్తామని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement