Saturday, May 18, 2024

MBNR: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బండారి భాస్కర్

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 16 (ప్రభ న్యూస్) : ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జెడ్పి చైర్మన్.. మాజీ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ కమిటీ చైర్మన్ బండారి భాస్కర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గద్వాల నియోజకవర్గం, గద్వాల మండల పరిధిలోని కాకులారం గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన దళితవాడ ముద్దుబిడ్డ, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పి చైర్మన్ గా, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలోనే కొంత కాలంలోనే గొప్ప నాయకులతో కలిసి మన్ననలు పొందిన నడిగడ్డ నాయకుడు బీఆర్ఎస్ పార్టీని వీడి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గట్టు కృష్ణమూర్తి, బండారి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement