Monday, May 6, 2024

Madhapur – హోట‌ల్లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్ – క‌స్ట‌మ‌ర్స్, సిబ్బంది సేఫ్..

హైద‌రాబాద్ : మాదాపూర్ సాయిన‌గ‌ర్ కాల‌నీలోని ఓ హోట‌ల్‌లోని రెండు గ్యాస్ సిలిండ‌ర్ లు పేలిపోయాయు. సిలిండ‌ర్ పేలుడు ధాటికి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. ఈ ప్ర‌మాదంలో హోట‌ల్ పూర్తిగా ద‌గ్ధ‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని హోట‌ల్ నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. దీంతో హోట‌ల్ య‌జ‌మాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement