Thursday, December 5, 2024

పెళ్లి అంగీకరించరేమో అని ప్రేమ జంట ఆత్మ హత్య..

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో ప్రేమజంట (స్నేహ, నందీశ్వ‌ర్) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే స్నేహ మృతి చెందింది. నందీశ్వ‌ర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని సమాచారం. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని వీరిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. నందీశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సదరు జంట మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement