Thursday, May 9, 2024

London – మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన

లండన్ : సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ – యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మతు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు.

భూప్రపంచంలో కేవలం మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గతేడాది నవంబరు నుంచి తాను ఉద్యమాన్ని ఉధృతం చేశానని, ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించానని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించానని వివరించారు.తమ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని, ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చామని వివరించారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలిపారు. మరోవైపు, మహిళా భద్రత గురించి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement