Tuesday, April 30, 2024

Lok Sabha – ఒక మ‌తం మ‌రో మ‌తంపై గెలిచింద‌ని చెబుతున్నారా మోదీజీ … అస‌దుద్దీన్ ..

న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దేశానికి మోదీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ, ఈ దేశానికి మతం లేదని తాను నమ్ముతున్నానని అన్నారు. జనవరి 22 ద్వారా ఈ ప్రభుత్వం ఒక మతం మరొక మతంపై గెలించిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా..? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు.

తాను బాబార్, జిన్నా లేదా ఔరంగాజేబు ప్రతినిధినా..? అంటూ ప్ర‌శ్నించారు.. రాముడిని గౌరవిస్తాన‌ని, అదే స‌మ‌యంలో నాథురామ్ గాడ్సేను ద్వేషిస్తాన‌ని తేల్చి చెప్పారు. ఎందుకంటే హే రామ్ చివరి మాటలుగా ఉన్న వ్యక్తిని అతను చంపాడు అని అసదుద్దీన్ అన్నారు. మితవాద సంస్థలు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు డిసెంబర్ 6, 1992 తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయని ఓవైసీ అన్నారు. యువకులను జైలులో పెట్టారని, వారు వృద్ధులైన తర్వాత బయటకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైసీ తన ప్రసంగానికి ముగించడానికి ముందు ”బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది, ఎప్పటికీ ఉంటుంది” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement