Sunday, May 5, 2024

MDK: లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం… నటుడు తనికెళ్ళ భరణి

గజ్వేల్, జనవరి 17 (ప్రభ న్యూస్) : లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సినీనటుడు తనికెళ్ళ భరణి అన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్, రీజియన్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల చిత్రాలు హైదరాబాదులో సినీ నటుడు తనికెళ్ల భరణి ఇవాళ‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ… మానవసేవే మాధవసేవ అని లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. గజ్వేల్ లయన్స్ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని, అందుకు గొప్ప ఉదాహరణ లయన్స్ క్లబ్ అని సేవకు ప్రతిరూపంగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ భవిష్యత్తులో నిరుపేదలకు మరింత విస్తృత సేవలు అందించాలని, మానవజన్మ సార్థకం కావాలంటే దైవభక్తి, సేవానిరతి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ సెక్రటరీ సంజయ్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, రచయిత విశ్వేశ్వర్ రావు, శంకర్ నారాయణ, లయన్ కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement