Saturday, May 4, 2024

యూపీ కోటాలో రాజ్యసభకు లక్ష్మణ్‌.. సీఎం యోగీతో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు

బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ స్థానం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ ఇవ్వాల నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాత్ కూడా ఉన్నారు. కాగా, నలుగురి పేర్లతో బీజేపీ రాజ్యసభ సభ్యుల రెండో జాబితా నిన్న విడుదల చేసింది. అందులో యూపీ నుంచి కె.లక్ష్మణ్‌, మిథిలేష్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌ నుంచి సుమిత్రా వాల్మికీ, కర్ణాటక నుంచి లాల్‌ సింగ్‌ సిర్హోయాలను ఎంపిక చేసింది. దీంతో కె.లక్ష్మణ్‌ లక్నోకు వెళ్లి నామినేషన్‌ను దాఖలు చేశారు.

విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో కీలకంగా పని చేసిన లక్ష్మణ్‌ బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. హైదరాబాద్‌ నగర కార్యదర్శిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పీహెచ్‌డీ చేసిన లక్ష్మణ్‌ హిందీ, ఇంగ్లీషు భాషలలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement