Monday, May 6, 2024

కెసిఆర్…. లివింగ్ లెజెండ్ …కెటిఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసేందుకు అన్ని అవ‌రోధాల‌ను ఎదురించిన పోరాట ధీరుడాయ‌న‌. ప్రేర‌ణాత్మ‌క ఉద్య‌మాల‌తో అసాధార‌ణ నేత‌గా ఆవిర్భ‌వించిన వ్య‌క్తి.. ఇప్పుడు ఓ అసామాన్య‌ ప‌రిపాల‌కుడు.. విజిన‌రీ అన్న ప‌దానికి మ‌హోన్న‌త ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే లివింగ్ లెజెండ్ ఆయ‌న‌. ఆ అపూర్వ‌మైన వ్య‌క్తిని నాన్న అని స‌గ‌ర్వంగా పిలుస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇవాళ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇవాళ 68వ ప‌డిలోకి ప్ర‌వేశించారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ ఓ పోస్టు చేశారు. మ‌న‌వ‌రాలు అలేఖ్య‌తో క‌లిసి కేసీఆర్‌ దిగిన ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేస్తూ ముఖులిత హ‌స్తాల‌తో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement