Thursday, April 25, 2024

వైరల్ గా ‘ప్రభాస్..కృష్ణంరాజు’ల ఫోజ్

తన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజుతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పిక్ వైరల్ అవుతోంది.  రాధేశ్యామ్ లొకేషన్ లో  తీసిన ఒక ఆహ్లాదకరమైన ఫొటోను ట్విట్టర్ లో  పంచుకుని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు ప్రభాస్. కృష్ణంరాజు ప్రభాస్ కలిసి ఉన్న ఇలాంటి ఫొటో ఇప్పటిదాకా అభిమానులు చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు.ప్రభాస్ యూత్ఫుల్ లుక్తో ఉన్న ఈ ఫొటోలో కృష్ణంరాజు సైతం జీన్స్ టీషర్ట్ జాకెట్తో ట్రెండీ లుక్ తో  కనిపిస్తున్నారు. ఆయనని ఇలాంటి లుక్ లో  ఇప్పటిదాకా అభిమానులు చూసి ఉండరేమో. కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ  డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది ఈ పోజు. ఇది సినిమాలో భాగమా లేక షూటింగ్ గ్యాప్ లో  ఇలా సరదాగా దిగిన ఫొటోనా అన్నది తెలియదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement