Monday, April 29, 2024

TS : ఇవాళ వ‌రంగ‌ల్ జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయా పార్టీలు ప్ర‌చారాల‌ను హోరెత్తిస్తున్నాయి. వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో అటు క్యాడ‌ర్‌, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ ను నింపుతున్నారు. కాంగ్రెస్ ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి అభ్య‌ర్థుల త‌రుపున ప్ర‌చారాలు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా వారి నామినేష‌న్ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్య‌ర్థులు కూడా త‌మ ప్ర‌చారాల‌ను కొన‌సాగిస్తున్నారు. కాగా ఇవాళ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

- Advertisement -

హంటర్ రోడ్డు లోని డి కన్వెన్షన్ లో జరిగే బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ లో పాల్గొననున్నారు కేటీఆర్. ఇక ఇవాళ సాయంత్రం 6 ఊర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జరిగే వరంగల్ తూర్పు కార్యకర్త సమావేశం లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ గెలిచే విషయంపై చర్చించనున్నారు. పార్టీని ముందుకు తీసుకుని పోయేలా దిశా నిర్దేశం చేయ‌నున్నారు కేటీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement