Sunday, May 19, 2024

మ‌రోసారి టికెట్ ఇచ్చిన కెసిఆర్ కు కెటిఆర్ ధ‌న్య‌వాదాలు…జాబితాలోని అభ్య‌ర్ధుల‌కు శుభాకాంక్ష‌లు ..

కాలిఫోర్నియా – బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ నేడు 115 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించారు… అందులో సిరిసిల్లా నుంచి పోటీ చేసేందుకు కెటిఆర్ కు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించారు.. దీనిపై ఆమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కెటిఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు..

‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి హామీ దక్కిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా తనను మరోసారి నామినేట్ చేసిన గౌరవనీయ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలి. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ టికెట్ ఆశించిన వ్యక్తి), కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. పోటీ అవకాశం తిరస్కరణకు గురైన కృష్ణతోపాటు మిగతావారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా లభిస్తుంది. ’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement