Monday, May 6, 2024

ఫాక్స్ కాన్ కు కెటిఆర్ భూమి పూజ – చిర‌కాలం గుర్తుండిపోయే రోజ‌న్న‌ మంత్రి

కొంగ‌ర‌క‌లాన్ – ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్​కాన్​ కంపెనీకి ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు కంపెనీ సీఈవో యాంగ్‌లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్​లో కేటీఆర్​ మాట్లాడుతూ.. ఫాక్స్​కాన్​ పెట్టుబడి పెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. భారత్​లో క్రియేట్​ అయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే క్రియేట్ అవుతోందని తెలిపారు. రాష్ట్రావిర్భావం తరువాత కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, సీఎం కేసీఆర్​ నాయకత్వంలో రాష్ర్టం పురోగాభివృద్ధి సాధిస్తోందన్నారు. కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ తెలంగాణకు ఐకాన్‌గా నిలువనుందని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్‌లో సంస్థతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గతేడాది దేశంలో కల్పించిన ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలో ఇచ్చామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. మరో 10 ఏండ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

తెలంగాణలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఫాక్స్‌కాన్‌ సీఈవో యాంగ్‌లియూ అన్నారు. ప్లాంటు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఫాక్స్​కాన్(ఎలక్ట్రానిక్​ మ్యానుఫ్యాక్చరింగ్) కంపెనీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్​లో రూ.1,656 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. టీఎస్ఐఐసీ కి చెందిన 200 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటుకానుంది. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 35 వేలు, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఏడాదిలోగానే ఈ సంస్థ త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే అవ‌కాశాలున్నాయి.. ముఖ్యంగా ఈ కంపెనీ ఐ ఫోన్ ల‌ను త‌యారు చేయ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement