Monday, April 29, 2024

అభివృద్ధి మావంతు, షిండే ను గెలిపించడం మీ వంతు – కేటీఆర్

బాన్సువాడ , మార్చ్ 15 ప్రభ న్యూస్ – జుక్కల్ నియోజకవర్గం మా ప్రభుత్వం వంతు జుక్కల్ ఎమ్మెల్యేగా హనుమంతు షిండే ను గెలిపించడం మీ ప్రజల వంతు అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాటి ప్రభుత్వ లు జూకల్ నియోజకవర్గం వెనక బాటు తనం ఉండేదని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావించి జుక్కల్ ప్రాంతానికి వెనుకబడ్డ ప్రాంతాన్ని పలుసార్లు ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ వ్యక్తి ఉదార సబావుడు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంచి నాయకుడని కేటీఆర్ కితాబు ఇచ్చారు. జూకల్ ప్రాంతాల సమస్యలను ‌ మా ‌ దృష్టికి తీసుకొస్తూ మా ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ వ్యక్తికి పట్టం కట్టాలని ఆయన కోరారు. పలుసార్లు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే ను పిట్లం, బిచ్కుంద మున్సిపల్ గ మార్చాలని కోరిన వెంటనే అన్ని సమస్యలను అభివృద్ధికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నామంటూ ఆయన ఈ సభాముఖంగా తెలియజేశారు. నూతనంగా జూనియర్ కళాశాల ఏర్పాటు, డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఆయన ఈ సభముఖంగా హామీ ఇచ్చారు.

రామన్న నీ అడుగుజాడలో హనుమంతునిగా ‌ అడుగులో అడుగు వేస్తూ మీ ఆదేశాలు పాటిస్తూ అభివృద్ధి దిశలో కృషి చేస్తాం రామన్న అంటూ చేసిన‌ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రసంగం ఆకట్టుకుంది. బీటీ రోడ్లు, 96 బీటు రోడ్ల గాను 72 బీటీ రోడ్లనుమిగతా బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. జూకల్ నియోజకవర్గంలో రెండు బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ‌ పక్క రాష్ట్రాలైన ‌ మహారాష్ట్ర కర్ణాటకలో లేవన్నారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ‌ సమస్యలపై ఉద్యమాలు చేస్తే ప్రశ్నిస్తే ఏదో కేసులలో ఇరికించాలని బిజెపి ప్రభుత్వం కక్షపూరిత ఆలంబిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవితమ్మ వెంటే మేముంటాం అంటూ ఆయన అన్నారు.

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ‌ వేసారి నాటి నందమూరి తారకరామారావు మూడు పథకాలతో ప్రజల్లోకి వెళ్లడంతో కేవలం 9 నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం వచ్చిందని, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్, 36 పథకాలతో ప్రజలకి పెన్షన్లు, షాది ముబారక్, రైతుబంధు రైతు బీమా, ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఏనాటికి మునిగిపోదని ఎప్పటికీ ప్రజల్లో ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ‌ నిజాంబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ‌ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ విప్పు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ శోభ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ముజీబుద్దిన్, పిట్లం ఎంపీపీ కవిత విజయ్, పిట్లం సర్పంచ్ విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement