Saturday, April 20, 2024

రావ‌ణాసుర నుండి లిరిక‌ల్ సాంగ్.. వెంక‌టేశ్ సాంగ్ రీమిక్స్

వ‌రుస విజ‌య‌జాల‌తో దూసుకుపోతున్నాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌..ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం రావ‌ణాసుర.ఈ చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.హీరో రవితేజ – హీరోయిన్ మేఘ ఆకాశ్ పై చిత్రీకరించిన ఈ పాట, ‘వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే .. ‘ అంటూ ఈ పాట కొనసాగుతోంది. 1991లో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘సూర్య ఐపీఎస్’ సినిమాలోని పాటకు ఇది రీమిక్స్. సిరివెన్నెల రాసిన ఆ పాటకు అప్పట్లో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఆ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో అనూ ఇమ్మాన్యుయేల్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ … రావు రమేశ్ .. మురళీ శర్మ .. సంపత్ రాజ్ కనిపించనున్నారు.సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.రవితేజ తన నెక్ట్స్‌ సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement