Wednesday, March 22, 2023

ట‌బుతోనే సినిమా ఎందుకు.. అజ‌య్ దేవ్ గ‌ణ్ ఏం చెప్పారు

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఎక్కువ‌గా న‌టి ట‌బుతో సినిమాలు చేస్తుంటారు. కాగా ఆయ‌న న‌టించిన తాజా చిత్రం భోళా..ఖైదీ’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ట్విట్టర్ లో ‘ఆస్క్ భోళా’ అంటూ అభిమానులతో ముచ్చటించారు అజ‌య్ దేవ‌గ‌ణ్. ఈ సందర్భంగా ఓ అభిమాని అసక్తికర ప్రశ్న అడిగాడు. మీరు అన్ని సినిమాలు న‌టి టబుతోనే చేస్తున్నారు. దీనికి ఏదైనా కారణం ఉందా అని ట్వీట్ చేశాడు. దీనికి అజయ్ బదులిస్తూ.. ఎందుకంటే.. ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అని చెప్పారు. భోళా చిత్రం ఎంత రాబడుతుందని మీరు అనుకుంటున్నారు అని ఓ యూజర్ అడగ్గా.. ఎంత డబ్బు కలెక్ట్ చేస్తుందో తెలియదు కానీ.. మీ ప్రేమను పొందుతుందని మాత్రం ఆశిస్తున్నా అని అజయ్ బదులిచ్చారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement