Saturday, May 18, 2024

టిఆర్ ఎస్ నేత కృష్ణ సాగర్ మృతి..ఘనంగా నివాళులు..

ప్రజల కోసం నిరంతరం పనిచేసే మంచి లీడర్ ను కొత్తకోట పట్టణం కోల్పోయిందని మార్కెట్ చైర్మన్ సాక బాల నారాయణ , ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి అన్నారు. ప్రజలందరిలో కలుపుగోలుగా ఉంటూ నవ్వుతూ నవ్వించే వ్యక్తి ఇక లేరు అనే విషయాన్ని కొత్తకోట పట్టణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్తకోట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని మాజీ వార్డు మెంబర్ తెరాస సీనియర్ నాయకులు కృష్ణ సాగర్ గుండెపోటుతో అకాలమరణం చెందారు.

ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ సాక బాల నారాయణ , ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ ఎంపీటీసీ సత్యం యాదవ్.. కొత్తకోట మండల్ కో ఆప్షన్ సభ్యులు లతీఫ్ , చర్లపల్లి మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ , తెరాస సీనియర్ నాయకులు అస్కాని శ్రీనివాసులు సాగర్ , రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement