Thursday, May 2, 2024

Kite Festival: మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివ‌ల్‌… ట్రాఫిక్ ఆంక్ష‌లు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్ కైట్ ఫెస్టివ‌ల్‌కు ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌-2024 జరుగ‌నుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు సాగించాలని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ సూచించారు.

తివోలి క్రాస్‌ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు రహదారిని మూసేసి, ట్రాఫిక్‌ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్‌ రోడ్స్‌, సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్స్‌, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్‌ బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌బన్‌ క్రాస్‌ రోడ్స్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, పారడైజ్‌ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని వివరించారు. రైల్వే స్టేషన్‌, జూబ్లీ బస్‌స్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులు తమ ప్రయాణాలను సాఫీగా చేసే విధంగా ఫ్లాన్‌ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైలు సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రౌండ్‌కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement