Friday, April 26, 2024

పిలిస్తే పలుకుతున్న కోడి.. అమాంతం పెరిగిన వ్యాపారం

కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. ఇక మనుషులు మాదిరిగానే వాటి పిల్లలపై అవి చూపించే ఎమోషన్స్.. మనతో ప్రవర్తించే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక వీటికి సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులు చేసే చిలిపి అల్లరి పనులు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కలిగిస్తాయి. తాజాగా ఓ కోడి తన యజమాని పిలిస్తే ఎక్కడున్నా టక్కున పరిగెత్తుకుంటూ వచ్చేస్తోంది.

సాధారణంగా మనిషితో పెంపుడు జంతువుల అనుబంధాన్ని విడదీయలేం. అలాగే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఓ కోడి తన యజమాని పిలిస్తే ఎక్కడున్నా ఆ కోడి వస్తుంది. అదికూడా కోడిని పిలిచినట్లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దానికో పేరుంది. ఆ కోడి పేరు చోటూ. చోటూ ఖనా కాయింగే అహో.. జల్దీ జల్దీ అహో అంటూ యజమాని పిలవగానే వచ్చేస్తోంది. ఈ కోడి దాణాకు బదులు చికెన్ పీస్ అందిస్తే వచ్చి ఆరగిస్తుంది.

పాలేరు గ్రామంలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా చికెన్ షాప్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ఫారం నుంచి కోళ్లను కొనుగోలు చేశాడు. అందులో ఓ కోడి మాత్రం యాక్టివ్‌గా ఉండేది. ప్రతిరోజూ లాగే వాటికి మేత వేసే సమయంలో అతడు కోళ్లఫారంలోకి రాగానే అతని చుట్టూ తిరుగుతూ అల్లరి చేసేది. దీంతో నాగుల్ మీరా దానికి కనెక్ట్ అయ్యాడు. దానికో చోటూ అని పేరు కూడా పెట్టాడు. అది వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం సహితం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కోడినే ఆడిగేవారన్నారు. నాగుల్ మీరా మాత్రం దాన్ని తప్ప మిగిలినవి అమ్మేవాడు. ప్రతి రోజు వ్యాపారం లాభసాటిగా మారడంతో చోటూకి మాత్రం దాణాకి బదులు ఆహారంగా చికెన్ పిసులు అందించేవాడు. కోడి చేసే అల్లరితో చికెన్ కోసం వచ్చే కస్టమర్లే కాకుండా కోడిని చూసేందుకు జనాలు బాగా వస్తుండడంతో వ్యాపారం సాగుతున్నట్లు యజమాని చెబుతున్నాడు. కొందరైతే ఎక్కువ డబ్బులు ఇస్తాం ఆ కోడిని ఇమ్మని ఆఫర్స్ పెట్టినా దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ కోడి ఉపాయం అతడికి లాభాన్ని చేకూరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement