Monday, April 29, 2024

KHM: ఈనెల 7, 8న ఖమ్మంలో సమ్మక్క – సారక్క మినీ జాతర..

ఖమ్మం : 47వ డివిజన్ బొక్కల గడ్డ మున్నేరు బ్రిడ్జ్ పక్కన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం ప్రాంతంలో సమ్మక్క – సారక్క జాతర మహోత్సవం కార్యక్రమం ఈనెల 7, 8న అంగరంగ వైభవంగా, కనులు పండుగగా మేడారం జాతర తరహాగా జరుగుతుందని ఆలయ పూజారి ఉప్పిసాయి చౌదరి తెలిపారు.

ఏడవ తారీకు బుధవారం సాయంత్రం 6 గంటలకు పసుపు కుంకుమతో, డీజే సౌండ్ తో, మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో, శివశక్తుల విన్యాసాల నృత్యాలతో ఆ ప్రాంతం మొత్తం ఊరేగింపుతో సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లు గద్దనెకుతారని, మరుసటి రోజు ఎనిమిదో తారీకు ఉదయం 10గంటల నుండి ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం కార్యక్రమం అనంతరం అన్నదానం ఉంటుందని తెలిపారు. ప్రతీ ఏటా లాగే ఈ ఏటా కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ రెండు రోజులు జాతర పండగ వాతావరణం నెలకొంటుందని, ఈ జాతరకు అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement