Saturday, November 9, 2024

అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త పాటించాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనుల్లో నాణ్య‌త పాటించాల‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ శ్రీనివాస నగర్ లో రూ.45 లక్షలు, 32వ డివిజన్ గ్రైన్ మార్కెట్ రోడ్ లో రూ.45 లక్షలు మొత్తం రూ.90 లక్షాలతో నిర్మించనున్న సీసీ సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు గజ్జెల లక్ష్మీ, దొన్వాన్ సరస్వతి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement