Wednesday, November 27, 2024

Manuguru – విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

మణుగూరు , ,(ఆంధ్రప్రభ న్యూస్): మణుగూరులోని గ్రేష్ మిషన్ పాఠశాలలో విద్యుత్ షాక్ తో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందిన,ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం ,కాళీమాత ఏరియాకు చెందిన ఉపేందర్,రత్నం లు పట్టణ పరిధిలోని గుట్ట మల్లారం గ్రేష్ మిషన్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.

ఆదివారం పాఠశాల గోడకు అమర్చిన ఐరన్ పైపులు తోలగిస్తుండగా,విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్క సారిగా విద్యుత్ షాక్ గురయ్యారు.ఇద్దరూ అక్కడక్కడే మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, సి.ఐ సతీష్ కూమర్,రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement