Wednesday, November 27, 2024

KHM : ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీజ‌

ఖమ్మం, నవంబర్ 4 : ప్రజావాణి దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ ) డా.పి.శ్రీజ అన్నారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ( ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్) డాక్టర్.పి.శ్రీజ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా రావాలని, ఎవరూ రాకుండా ఉండొద్దన్నారు.

ఏయే శాఖల నుంచి ప్రజావాణికి వచ్చారు, ఎవరు రాలేదని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా వరద ప్రవాహ బాధితులు వస్తున్నందున వారి స్టేటస్ ఏమిటో చూసి వాళ్లకి అర్థమయ్యే విధంగా వివరించాలని అధికారులను ఆదేశించడం జరిగింద‌న్నారు. మామిళ్ళగూడెం నుంచి ఒక దరఖాస్తుదారుడు తన ఇంటి వద్ద చెట్టు కూలిపోయే స్థితిలో ఉన్నందున డీఆర్ఎఫ్‌ సిబ్బందిని పంపించి తొలగించాలని అడగ్గా శానిటేషన్ సూపర్ వైజర్ వెళ్లి చూసి అనంతరం డీఆర్ఎఫ్‌ సిబ్బందిని తీసుకొని వెళ్లి తొలగించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement