Monday, April 29, 2024

Raghunadhapalem: తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు

ఖమ్మం : నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మైమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రులు లాంఛనంగా ప్రారంభించి సబ్ ఇన్ స్పెక్ట‌ర్ మాచినేని రవి, తహశీల్దార్ నర్సింహ రావులను తమ సీట్ లో కూర్చోబెట్టారు.
రూ.50లక్షలతో పోలీస్ స్టేషన్, రూ.50లక్షలతో తహశీల్దార్ భవనాలు నిర్మించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించుకోవడం పట్ల మంత్రి మైమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఏర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పాలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్, కొండబాల కోటేశ్వర రావు, జెడ్పీటీసీ ప్రియాంక, మేయర్ నీరజ, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఆర్ జే సీ కృష్ణ, సుడా ఛైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement