Saturday, April 27, 2024

ఖమ్మంపై మంత్రి పువ్వాడ పట్టు – కారుతో సిపిఐ దోస్త్….

టిక్కెట్ దక్కితే చాలు
నేతల మధ్య గ్యాప్‌
జోరుగా అనుచరుల వలసలు
ఆసక్తికరం… ఖమ్మం పోరు
చక్రం తిప్పిన మంత్రి పువ్వాడ – మేయర్‌ అభ్యర్థిగా సతీమణి
పొంగులేటి వర్గీయులకు చెక్
స్తబ్దుగా మారిన తుమ్మల
నామా వర్గీయులకు ఒకే సీటు
ముగిసిన నామినేషన్ల పర్వం
తెరాసతో సీపీఐ దోస్తీ
కాంగ్రెస్‌కు కలిసొచ్చిన తెరాస విభేదాలు
భాజపాతో జనసేన దోస్తీ

హైదరాబాద్‌, : రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ఎపుడూ విభిన్నం. కార్పోరేషన్‌ ఎన్నికల వేళ కూడా.. ఖమ్మం పాలిటిక్స్‌ వైవిధ్యం రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పోరేషన్‌ను గెలుచుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌ తపన పడుతుండగా, ఇదే సందర్భంలో ఏళ్ళతరబడి ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేసిన హేమాహేమీలు తమ అనుచరులను సంతృప్తిపరచలేక సతమతమవుతున్నారు. ఖమ్మం టీఆర్‌ఎస్‌లో గత రెండేళ్ళుగా నాలుగు స్తంభాలాట సాగుతుండగా, ఖమ్మం కార్పోరేషన్‌ టికెట్ల వ్యవహారం నేతల మధ్య అగాధాన్ని మరింత పెంచుతున్నట్లు కనబడుతోంది. ఎవరికి వారు.. ఖమ్మంపై ఆధిపత్యమో.. తమ అనుచరులను కాపాడుకోవాలన్న తపనతోనే పార్టీ టికెట్లు కోరుకుంటుండగా, ఇక్కడే నేతల మధ్య గ్యాప్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం రాజకీయాలపై తనదైన ముద్రవేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకోగా, గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. అయినా అనుచరులను కాపాడుకుంటూ తరచూ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల్లో అనుచరుల నుండి టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి రాగా, 17 డివిజన్లు కోరినట్లు తెలిసింది. టికెట్లపై హామీ లేకపోవడంతో అనుచరులు
వారించినా వినకుండా ఇతర పార్టీల్లోకి దూకి టికెట్లు తెచ్చుకున్నట్లు సమాచారం. ఎంపీ నామా అనునాయులు, గతంలో వెంట తిరిగిన పలువురు మద్దతుదారులు కూడా టికెట్‌పై హామీలు లేకపోవడంతో అనుచరులు సొంత ప్రయ త్నాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల నుండి తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నా కార్పోరేషన్‌ రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడయి నట్లు తెలిసింది. 2016 కార్పోరేషన్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నుండి తుమ్మల నాగేశ్వరరావు హవా సాగగా, వైఎస్సార్‌సీపీ తరుపున ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీడీపీలో నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్‌ హవా సాగింది. నాలుగు పార్టీల్లో నలుగురు నేతలు.. టికెట్ల కేటాయింపులో తమ అనుచరులకు న్యాయం చేసుకోగా, ఇపుడు అందరూ ఒకేగూ టిలో ఉండడంతో టికెట్ల విషయంలో అందరిపైనా ఒత్తిడి ఉంది. దీంతో బలమైన నాయకులు, వివిధ నేతల అనుచరు లు.. ముందు బరిలో నిలిచి గెలవాలనే పట్టుదలతో నేతల ఆదేశాలను, బుజ్జగింపులను కూడా లెక్కచేయకుండా ఇతర పార్టీల నుండి బరిలోకి దిగేందుకు సై అన్న పరిస్థితి నెలకొ న్నట్లు తెలిసింది. ఏ పార్టీలో ఉన్నా.. మీ మనుషులమే.. ముందు మా భవిష్యత్తు కూడా చూసుకోవాలిగా అంటూ పలువురు అనుచరులు నేతలకే పాఠాలు చెబుతున్నట్లు సమా చారం. రాజకీయంగా ఇది ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది.. పార్టీపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అన్న అంశం ఆసక్తిక రంగా మారింది.
ఖమ్మం విలక్షణ రాజకీయాలపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆరా తీయగా, ఉపసంహరణల ఘట్టం తర్వాత ముఖ్యనేతలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌, సీపీఐ మధ్య పొత్తు ఉండగా, సీపీఐకు మూడు డివిజన్లు కేటాయించినట్లు తెలిసింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పోరేషన్‌లో.. తాజాగా జరుగుతున్న వలసలు కాంగ్రెస్‌కు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఫైట్‌ చేయాలని నిర్ణయించాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున మేయర్‌ అభ్యర్ధిగా మంత్రి అజయ్‌ సతీమణి వసంతలక్ష్మిని నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. 20వ డివిజన్‌లో ఆమె నామినేషన్‌ వేశారు. ఈ ఎన్నిక కోసం మంత్రి అజయ్‌ ముందు నుండీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement