Sunday, May 19, 2024

వీరభద్రాలయం ముఖ మండప నిర్మాణానికి భూమిపూజ

శతాబ్దాల చరిత్ర కలిగిన తేగడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ ముఖ మండప నిర్మాణానికి గురువారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చర్ల మండల తహసీల్దార్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంశపారంపర్యంగా పూజలందుకుంటూ భక్తుల హితోధిక సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న తేగడ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ ముఖమండపం నిర్మించేందుకు శివ్వారపు వీరభోగాచారి – ఈశ్వరమ్మ దంపతులు ముందుకు వచ్చారు. వారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి తహసీల్దార్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భక్తుల సహకారంతో ఆలయం అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందించదగిన విషయమన్నారు. గిరిజన ప్రజలు తమ ఇలవేల్పుగా భద్రకాళి అమ్మవారిని కొలుస్తారని, అటువంటి అమ్మ వారి ఉత్సవాలు వేడుకగా జరిగే ఆలయం ముఖమండప శంకుస్థాపన పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖమండప నిర్మాణదాతలు వీరభోగాచారి – ఈశ్వరమ్మ దంపతులు మాట్లాడుతూ…. ముఖమండప నిర్మాణంలో భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన వీరభద్ర స్వామి వారి సేవలో తాము నిరంతరం కొనసాగించేలా చూడమని వారు కోరారు. ఈ పూజా కార్యక్రమం ఆలయ నిర్వాహకులు ఎలమందల శ్రవణ్ కుమార్, భాను ప్రకాష్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజినీర్ మణిచంద్ర, దినసరపు సంజీవ రెడ్డి, దినసరపు కృష్ణారెడ్డి, మేడిచర్ల సత్యనారాయణ, యల్లమందల శివప్రతాప్, వీరభద్రస్వామి, యల్లమందల భద్రయ్య(బాజీ), మద్ది భాస్కర్ రెడ్డి, కండ్రపు వెంకట్ రెడ్డి, మద్ది మనోహర్ రెడ్డి, శివారపు నరేష్, ఎర్ర బాబు, గుంటుపల్లి నరేష్, దొడ్డి ఆదినారాయణ, త్రినాథులు, గ్రామ సర్పంచ్ అలవాల పార్వతి, ఉపసర్పంచ్ శ్యామల శివ, ఎల్లమందల చక్రవర్తి, ప్రవీణ్, జగదీష్, ముఖేష్ తో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement