Thursday, May 9, 2024

Khammam – గాంధీ భ‌వ‌న్ లో గాడ్సే – రేవంత్ పై మంత్రి పువ్వాడ ఫైర్

ఖ‌మ్మం – గాంధీ భ‌వ‌న్ లో గాడ్సే గా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దూరారంటూ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ విమ‌ర్శించారు. రైతుల‌కు 24 గంట‌లు విద్యుత్ అవ‌స‌రంలేద‌ని రేవంత్ చేసిన వ్యాఖ్యాల‌పై పువ్వాడ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీకి ఏనాడు రైతుల ప‌ట్ల అభిమానం లేద‌ని మ‌రోసారి రుజువైంద‌ని అన్నారు.. 3 గంటల కరెంట్ ఇస్తామని అంటున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే మీ మ్యానిఫెస్ట్ లో పెట్లాల‌ని ఛాలెంజ్ విసిరారు .. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశానికి వదిలిన రుగ్మతలే ఈ దేశానికి ఇబ్బందిగా మారాయన్నారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వ‌క‌పోతే మీ పార్టీ ఒక్క కార్య‌క‌ర్త‌ను కూడా రైతులు గ్రామాల్లోకి కూడా రానివ్వరు మిమ్మల్ని అంటూ మండిపడ్డారు. రైతుల పట్ల రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రేమ ఏంటో అర్ధమవుతుందని చెప్పారు. మీరు ఎన్ని చెప్పినా.. తాము ఖచ్చితంగా 24గంటల ఉచిత కరెంట్ రైతులకు ఇస్తామని తెలిపారు.

కాగా, కామ‌న్ సివిల్ కోడ్ పై ఆయ‌న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం దేశానికి మంచిది కాద‌న్నారు… బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెట్టేలా చేస్తుంద‌నిఅన్నారు. . సెక్యులర్‌ భావాన్ని బీఆర్ ఎస్‌ పార్టీ ఎప్పుడు వదల్లేదని అన్నారు. ఇక రాహుల్ గాంధీ ఉమ్మడి పౌరసత్వం పై నోరు ఎందుకు పెగలట్లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి బీటీమ్ కాంగ్రెస్ అని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా బీఆర్‌ఎస్‌ కలిస్తే తాను రాజీనామా చేస్తాన‌ని అంటూ ఖమ్మంలో మతతత్వ పార్టీలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఆఫ్ టోపి పెట్టుకునే నాయకులు వస్తార‌ని, ప్రజలకు టోపి పెట్టి వెళ్లిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి మొనగాడు మాత్రమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement