Sunday, May 5, 2024

Khammam : విద్యా దినోత్స‌వంలో.. విద్యార్థిలా మారిన .. మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఒకప్పుడు సర్కార్‌ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి.. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు- మన బడి’తో పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో మన ఊరు మన బడి.. మన బస్తీ మన బడి పథకం ద్వారా మొత్తం రూ.5.65కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నందు రూ.2.30 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

పాండురంగాపురంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.62.92 లకలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఖమ్మం రోటరీ నగర్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ మన బడి పథకం ద్వారా రూ.72.66 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.నయా బజార్ లోని ప్రాథమిక పాఠశాలలో రూ.39.32లక్షలు, ఉన్నత పాఠశాలలో రూ.55.61 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. SR &BGNR డిగ్రీ కళాశాలలో రూ.1.05 కోట్లతో నిర్మించిన నూతన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను ప్రారంభించారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం పాఠశాలలో వారం రోజుల్లో మూడు రోజులు రాగి జావ, మూడు రోజుల పాటు బాయిల్డ్ ఎగ్ అమలు చేస్తున్న కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది విద్య మాత్రమే అని, అందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ పేదలకు నాణ్యమైన విద్యను కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నేడు అందిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గతంలో లాగా విద్యా సంవత్సరం మధ్యలో పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం నుండి పాఠశాల ప్రారంభంలోనే అన్ని పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తూన్నమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఆయా పనులను సమర్థవంతంగా నిర్వర్తించిన జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DEO సోమశేఖర్ శర్మ, అధికారులు సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement