Sunday, December 8, 2024

Khammam : సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు.. మంత్రి పువ్వాడ శంకు స్థాపన

ఖమ్మం : జిల్లా సమీకృత కార్యాలయం వ‌ద్ద రూ.17లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ రూంని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1కోటి 78 వేలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ తో పాటు ఇందన వనరుల అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో నిర్మించనున్న 100 కిలో.వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్తా, వివి పాలెం సర్పంచ్ రవెళ్ళ మాధవి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement