Friday, May 17, 2024

Khammam – కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి జోరందుకున్న వ‌ల‌స‌లు..

రఘునాథ పాలెం (ఖమ్మం) : ఖమ్మం జిల్లా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనీ రఘునాధపాలెం మండలంలో ఆదివారం రాత్రి పలువురు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీకి బలమైన శక్తిగా తయారువుతుందనీ నాయకులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేల కోట్ల నిధులతో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై రఘునాథపాలెం మండలం పుటాని తండాలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి 50 కుటుంబాలు వారు చేరారు . ఈ సందర్భంగా వారికి మండల పార్టీ అధ్యక్షులు వీరు నాయక్, మంత్రి పీఏ రవికిరణ్, నాయకులు మండదపు నర్సింహరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి అజయ్ కుమార్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేసి, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మంత్రి అజయ్ ని గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రఘునాథపాలెం మండల రూపురేఖలు మారాయి అని స్పష్టం చేశారు. అది కేవలం మంత్రి అజయ్ కుమార్ ముందు చూపు తోనే సాధ్యమైంది అని అన్నారు. కొందరు డబ్బుతో రాజకీయాలు చేయవచ్చు అని కలలు కంటున్నారు అని, అవి ఖమ్మం నియోజకవర్గంలో నడవవు అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ అప్జల్, సర్పంచ్ బుజ్జి బాలాజీ,వైస్ సర్పంచ్ బాలాజీ, కొఖ్య, శంకర్, బాల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement