Sunday, April 28, 2024

KCR: నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం…

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం శాసనసభకు వెళ్ల‌నున్నారు. ముందుగా ఆయ‌న ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో పూజలు చేయనున్నారు.

అనంత‌రం సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావ‌ల‌సిందిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ ఆహ్వానించారు. కాగా, తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement