Sunday, May 5, 2024

అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి – కెసిఆర్

హైదరాబాద్ – అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వుండాలని, ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముస్లీం లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ గడ్డ ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. విద్యా, ఉపాధితో పాటు పలు రంగాల్లో ముస్లింలకు తమ ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ముస్లిం సోదరుల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం తాము అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నామని సీఎం అన్నారు. మైనారిటీ అభివృద్ధి కోసం తాము చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement