Sunday, May 5, 2024

సమయపాలన పాటించింది: లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు సూచన

ప్రతి నిత్యం కాజీపేటలోని పుడ్ కార్పోరేషన్  గోదాములకు తరలి వచ్చే లారీ డ్రైవర్లతో కాజీపేట్ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాజీపేట పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ భాగంగా వరంగల్  పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అదేశాల మేరకు కాజీపేట ఎఫ్.సి.ఐ గోదాముల సముదాయల ప్రాంగణంలో సమావేశం జరిగింది. నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో వుంచుకోని  ఎఫ్.సి.ఐ గోధాములకు బియ్యం తరలించి లారీ డ్రైవర్లు  సమయపాలన పాటించాల్సిన అవసరం వుందని.ముఖ్యంగా ఏఫ్.సి.ఐ గోదాముల పరిసరాల్లో ఎక్కువ సంఖ్యలో పాఠశాల లు వుండటం వలన స్కూల్ విధ్యార్థులు రాకపోకలు అధికంగా వుంటాయి. ఈ దృష్టిలో వుంచుకోని  లారీ డ్రైవర్లు ఉదయం 8గంటల నుండి 11 గంటల వరకు అలాగే సాయంత్రం  4గంటల నుండి రాత్రి 10గంటల వరకు లారీలను ఎఫ్. సి.ఐ గోదాములవైపు వచ్చేందుకు లేదని కావున లారీ డ్రైవర్లకు వేసులుబాటు కల్పించిన సమయాల్లోనే  ఎఫ్.సి.ఐ రావల్సి వుంటుందని కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ లారీడ్రైవర్లకు చూచిండంతో పాటు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం లారీ డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ లారీలను నడపవద్దని.. ట్రాపిక్ నిబంధనలను పాటించని లారీ డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని  ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement