Thursday, April 25, 2024

Big Story: మూతపడ్డ పరిశ్రమలే.. డ్రగ్స్‌ రాకెట్‌కు అడ్డాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పటికే గుడుంబా రహిత రాష్ట్రంగా ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి, ప్రమాదకర రసాయనాలు పట్టిపీడిస్తు న్నాయి. నిషేదిత డ్రగ్స్‌ తయారీ దారులు, స్మగ్లర్లు ఇప్పుడు కెమిస్ట్రీలో టాప్‌ స్టేజికి ఎదిగిన వాళ్లే ఉంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇవి గండికొడుతున్నాయి. రాష్ట్రంలో మూతపడిన పారిశ్రామిక వాడల్లోని పాత పరిశ్రమలే కేంద్రంగా నిషేదిత రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి.

జీడిమెట్ల, పటాన్‌చెరు, జిన్నారం, చౌటుప్పల్‌, మెదక్‌లతోపాటు పలు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కొత్త రకం డ్రగ్స్‌ ఉత్పత్తి కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. ఎఫిడ్రిన్‌, కెటెమైన్‌, ఇతర మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది. గంజాయి, కొకైన్‌, ఓపియం, ఎల్‌సిడి, హెరాయిన్‌లతో పాటు ప్రాణాలు నిలిపే మందులు తయారయ్యే ఎఫిడ్రిన్‌, కెటమైన్‌, మెఫిడ్రిన్‌, వంటి ఘాటైన, గంటలపాటు మనిషిని మత్తులో ఉంచే రసాయనాల డ్రగ్స్‌ కూడా మాదక ద్రవ్యాల ఒరవడిలోకే వస్తాయి.

అయితే గంజాయి, ఓపియం దేశంలో అనేకచోట్ల దొరుకతుండగా, గంజాయిపంట నుంచి నాణ్య మైన సురుకును వేరుచేసి దాన్ని మరింత నాణ్యంగా మారిస్తే నల్లమందు తయారవుతోంది. ఇందులో కొంత ఘాటుగా ఉండేది హెరాయిన్‌గా చెప్తారు. కాగా కొకైన్‌, ఎల్‌ఎస్డిలు దేశంలో దొర కవు, వీటిని వీటిని విదేశాల నుంచి దొం గ చాటుగా దేశంలోకి తీసుకొస్తున్నారు. విదేశాలనుంచి తరలించడం కష్టంగా మారడంతొ పాటు, నిఘా తీవ్రం కావడంతో స్థానికంగా మత్తు మందులను తయారు చేసేందుకు కొన్ని పారిశ్రామిక రసాయన పరిశ్ర మలు అడ్డాలుగా మార్చ‌కున్నారు.

కొందరు శాస్త్రవేత్తలు, ఫార్మ సిస్టులు ఇలా బృందాలు గా ఏర్పడి మూతపడిన రసాయన పరిశ్రమలను లీజుకు తీసుకుని ఎఫిడ్రిన్‌, కెటమైన్‌, మెఫిడ్రిన్‌ వంటి ఎక్కువ విలువైన మత్తు మందులను తయారు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కొన్ని రోగాలకు వాడే ఔషదాలను, రసాయనాలను కలిపి వీటిని స్థానికంగా తయారు చేస్తోన్నారు. ఈ మందులను అధికంగా వినియాగిస్తే తొలుత ఉల్లాసంగా, మత్తుగా అనిపిం చినా ధీర్ఘకాలికంగా నీరసం, ఇతర జబ్బులు, నాఢీ వ్యవస్థ దెబ్బ తినడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఆ తర్వాత మరణం కూడా సంభవించవచ్చని నిపుణులు చెబుతు న్నా రు.

ఇక్కడే ఎక్కువ…
ప్రధానంగా హాస్టళ్లలో ఉండి చదు వుకుంటున్న ఇంజీనిరంగ్‌ విద్యార్ధులు, బీబీఏ, ఎంబీఏ కాలెజీలు, హోటల్‌ మేనే జ్‌మెంట్‌ విద్యా ర్ధు లు, టోక్నో స్కూల్స్‌, ఐఐటీ ఫౌం డేషన్‌, కార్పొరేట్‌ ఇంటర్‌ కా లేజీల్లో విద్యా ర్ధులు ఎక్కువగా మత్తుకు బానిసలవుతున్నారు. అదేవిధంగా ప్రేమ విఫలమైనవాళ్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్లు, కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు, రాత్రి షిఫ్ట్‌ ఉన్నవాళ్లు, వారాంతపు పార్టీ కల్చర్‌కు అలవాటైనవాళ్లు, పబ్‌లలో గడిపేవాళ్లు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడు తున్నారని ఆబ్కారీ శాఖ నివేదికలో పేర్కొంది.

- Advertisement -

సరదాగా గోవా, కులూమనాలి, అరకు ట్రిప్‌లకు విహారయాత్రలకు వెళ్లినవాళ్లు కూడా ఈ జాఢ్యానికి బానిసలవుతున్నారు. రాష్ట్రంలో మద్యం, నాటుసారా, గంజాయి విక్రేతలు, సరఫరాదారులు, మత్తుమందుల తయారీదారులు ఇలా ఎవరికివారుగా గుట్టుగా తమపని తాము చేసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల నుంచి యధేచ్చగా బహిరంగ మార్కెట్‌లోకి మందు తరలిపోతోందని పలు ప్రాంతాల్లో గుర్తించారు. కల్తీ మద్యం, కల్తీ కల్లు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా ల్లో ఏరులై పారుతోందని అధికారులు గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తాజాగా దాడులు తీవ్రతరం చేశా రు. తాజాగా ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌లకు ఇచ్చిన పర్మి షన్లను ప్రభుత్వం లెక్కతీస్తోంది. ఇక్కడ ఉత్పత్తౖన ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ అక్రమంగా ఇతరుల చేతికి చేరి నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో ఈ మేరకు దృష్టిసారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement