Saturday, May 18, 2024

ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌లకు మ‌ధ్య కుల సంఘాలు వార‌ధిగా ఉండాలి – ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ ఆగస్టు (ప్రభ న్యూస్) 29: ప్రభుత్వానికి ప్రజలకు మద్య కులసంఘాలు వారధిగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నిజాంబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో గల విజయలక్ష్మి గార్డెన్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత , అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నగర మేయర్ దండు నీతూ కిరణ్ ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. పద్మశాలీలు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత మార్కండేయని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలకు డోకా లేదన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న పద్మశాలీలు నిరుపేదలుగా ఉండడం దురదృష్టకరం అన్నారు. పద్మశాలీల కులవృత్తులు అంతరించి పోయాయి. వ్యవసాయ భూములు లేక చాలామంది విద్య వైపు వెళ్లి ఉన్నత స్థాయిలో నిలిచారనీ పద్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. బిగాల గణేష్ మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు బిఆర్ఎస్ ప్రభు త్వం అభ్యర్థిగా ప్రకటించిందని రాబోయే ఎన్నికల్లో గణేష్ గుప్తకు అండగా ఉండి ఆశీర్వదించండనీ కోరారు. భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనీ కోరారు. మార్కండేయ వారసు లైన పద్మశాలీలు ధర్మరాజుకు సందేహం వస్తే మార్కండేయని అడిగి పరిస్థితి ఉండేదని అలాంటి పద్మశాలీల అభ్యు న్నతే దేయంగా కృషి చేస్తున్నా మన్నారు. వ్యాపారం చేసుకునే వారికి శాంతిభద్రత ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు 60 ఏళ్లలో చూస్తే ఏదో గొడవ జరుగు తూ ఉండేదని, ఈ 9 ఏళ్లలో ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా లాండ్ ఆర్డర్ని శాంతియుతంగా నడిపించిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.

వ్యాపారవేత్తల కు అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం బిఆర్ఎస్ అని అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంమేనని తెలిపారు. అందరి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు తుందన్నారు.చేనేత పరిశ్రమను గత ప్రభుత్వాలు పట్టిచుకో లేదు..చేనేత మీద పన్ను వేసిన ఏకైక ప్రధాని మోదీ మోడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఎం కెసిఆర్ నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం చేసిందన్నారు.

ఈ సంద‌ర్భంగా పద్మశాలీలు ఎమ్మెల్సీ కవితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య, ఉపాధ్యక్షులు గంటాల వెంకట నరసయ్య, దశరథం, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, కోశాధికారి గైరం కొండ విట్టల్, సహాయ కార్యదర్శులు దాసరి గుండయ్యా, బింగి మోహన్, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement