Monday, April 15, 2024

అన్నమయ్య కీర్తనలు : చిత్తజ గురుడ ఓ

రాగం : మధ్యమావతి

చిత్తజ గురుడ ఓ శ్రీనరసింహ
బల్లిసే సేరు మునులు పరికించవయ్య || ||చిత్తజ గురుడ ఓ||

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కె
ప్రకట మైన నీ కోపము మానవయ్య|| ||చిత్తజ గురుడ ఓ||

తుంబురు నారదాదులు దొరకొనిపాడేరు
అంబుజాసనుండభయ మడిగీనదె
అంబరవీధి నాడేలు అచ్చరలందరు గూడి
శంబర రిపు జనక శాంతము చూపవయ్యా || ||చిత్తజ గురుడ ఓ||

- Advertisement -

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు
సత్తుగ నీ దాసులము శరణు జొచ్చితిమిదె
ఇత్తల శ్రీ వేంకటేశ ఏలుకొనవయ్యా|| ||చిత్తజ గురుడ ఓ||

Advertisement

తాజా వార్తలు

Advertisement