Tuesday, February 27, 2024

RR: బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన

షాబాద్ (ప్రభా న్యూస్) : జిల్లాలోని షాబాద్ మండల పరిధిలో గల కొమరబండ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఈ బ్రిడ్జితో ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. అదేవిధంగా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement