Tuesday, October 8, 2024

మహిళ గ్యాంగ్ రేప్….. ఆపై దారుణ హ‌త్య‌….

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను దారుణంగా హత్య చేశారు. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 25వ తేదీన పాత సామగ్రి సేకరిస్తూ వెళ్లిన మహిళ నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి అనంతరం బండరాయితో మోది అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement