Saturday, October 12, 2024

రెండు, మూడు తాయిలాలు ప్రకటించి ఓట్లడిగితే ప్రజలు నమ్మరు – కాంగ్రెస్ కి కవిత చురకలు

హైదరాబాద్ – కాం గ్రెస్ పార్టీకి తెలంగాణ తో ఆత్మబంధం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఎన్నడూ మాట్లాడలేదని, రాష్ట్ర ఏర్పాటును ఆ పార్టీ పదేళ్లు ఆలస్యం చేసిందని ఆమె దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

పదేళ్లలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా? అని ఆమె కాంగ్రెస్‌ను సూటిగా ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని కవిత తెలిపారు. రెండు, మూడు తాయిలాలు ప్రకటించి ఓట్లడిగితే ప్రజలు నమ్మరని, క్రాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెడుతోందని, అయినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మరని కవిత వెల్లడించారు. అంతేకాదు రాష్ట్ర విభజన తొమ్మిది మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని కవిత గుర్తు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement