Thursday, May 16, 2024

Siricilla – తొమ్మిదేళ్ల‌లో అద్బుత ప్ర‌గ‌తి – వినోద్ కుమార్

సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం idoc కాన్ఫరెన్స్ హల్ లో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు.

అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల‌లో సిఎం కేసిఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణలను నిలిపామని చెప్పారు. మంత్రి శ్రీ కే తారక రామారావు మార్గదర్శనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని ఆలోచించే జాతీయ సమైక్యత దినోత్సవం చేస్తున్నామ‌ని , అన్ని ఆలోచించే హైదరాబాద్ సంస్థానం విలీనం ను జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. . రాచరిక పాలన నుండి విముక్తి పొందిన ప్రజాస్వామ్య పాలన ఆవిర్భవించిన 17, సెప్టెంబర్ 1948 నీ భిన్న ఆలోచన విధానం తో కొందరూ విమోచన, విలీన, విద్రోహ దినంగా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తాము మాత్రం అన్ని ఆలోచించే తెలంగాణ భారత దేశంలో భాగం కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినంగా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement