Friday, April 26, 2024

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్ : పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛ సర్వేక్షన్‌ 2022-23లో భాగంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దాసరి మమతా రెడ్డితో కలిసి పెద్దపల్లి పట్టణంలోని 3వ వార్డులో ప్లాస్టిక్‌పై సమరం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వయంగా ఖాళీ ప్రదేశాల్లో ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా తొలగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన చుట్టుపక్కల పరిసరాలు బాగున్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇందుకోసం పెద్దపల్లి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. చెత్తను బయట మురికి కాలువలో కానీ రోడ్ల పై కానీ, ఖాళీ ప్రదేశాల్లో వేయరాదన్నారు.

ప్రతిరోజూ ఉదయం మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించి మున్సిపల్‌ సిబ్బందికి సహకరించాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్ల వాడకం పూర్తిగా పెద్దపల్లిలో నిషేధించామని, బయటకు వెళ్లే సమయంలో ఇంట్లో నుండి బట్ట సంచులు వెంట తీసుకెళ్లాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మట్ట శ్రీనివాస్‌ రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ లైసెట్టి బిక్షపతి, మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, మున్సిపల్‌ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వార్డు కమిటీ- సభ్యులు, కమిటీ- యూత్‌ సభ్యులు, స్వచ్ఛంద సభ్యులు రాజ్‌ కుమార్‌, వెన్నం రవీందర్‌, మహిళలు, లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ సభ్యులు, ఐటిఐ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement