Thursday, April 18, 2024

చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ పై ప్ర‌శంస‌లు కురిపించిన.. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్

చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరేత్ ఒవెన్.. మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తున్న సామాజిక సేవ అందరికీ తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరేత్ ఒవెన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేశారు.

అనంతరం బ్లడ్ బ్యాంక్ ను పరిశీలించారు. అక్కడున్న వైద్యులు ఆయనకు బ్లడ్ బ్యాంక్ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఒవెన్ మాట్లాడుతూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ కు విచ్చేసినందుకు ఒవెన్ కు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త‌మ‌కి అభిమానులు ఎప్పుడూ అండ‌గా నిలుస్తున్నార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement