Friday, April 26, 2024

ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లో ఉద్రిక్తత.. కాంట్రాక్టు కార్మికులపై సీఐఎస్ఎఫ్ లాఠీ చార్జి..

ఎన్టీపీసీ : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లోని కాంటాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ లాఠీచార్జి చేశారు. సోమవారం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నాయకులు గతంలో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయాలంటూ గేటు మీటింగ్ ను నిర్వహించారు. అనంతరం జేఏసీ నాయకులు, కార్మికులు ఎన్టీపీసీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడంతో కార్మికులందరూ లేబర్ గేటు వైపు దూసుకెళ్లారు. కార్మికులు సీఐఎస్ఎఫ్ మధ్య తోపులాట తారస్థాయికి చేరడంతో కార్మికులను అదుపు చేసే క్రమంలో సీఐఎస్ ఎఫ్ కార్మికులపై లాఠీ చార్జి చేసారు. కార్మికులు సైతం సీఐఎస్ఎఫ్ రాళ్లు విసరడంతో పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సంఘటన స్థలానికి చేరుకుని రామగుండం సర్కిల్ ఇన్ స్పెక‌ర్ట‌ర్ లక్ష్మీనారాయణ , గోదావరిఖని సీఐ రమేష్ బాబు, ఎన్టిపిసి ఎస్ ఐ జీవన్ కార్మికులతో జేఏసీ నాయకులతో మాట్లాడి లాఠీ చార్జి దారి తీసిన పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement