Sunday, April 28, 2024

పెద్దపల్లి డీసీపీగా సునీత మోహన్

పెద్దపల్లి డీసీపీగా వి.సునీత మోహన్ ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 గ్రూప్ 1లో ఎంపికైన సునీత మోహన్ నల్గొండ సీసీఎస్ డీఎస్పీగా, సూర్యాపేట డీఎస్పీగా, నర్సంపేట ఏసీపీగా పనిచేసి ఏఎస్పీగా పదోన్నతి పొంది కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపల్ గా పనిచేశారు. నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన నాటినుండి హైదరాబాద్ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి పెద్దపల్లి డీసీపీ గా బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement