Sunday, May 26, 2024

Singareni: దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు

హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్‌ కింద రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఓక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో పండగ అడ్వాన్స్‌ను కూడా చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించ‌నున్న‌ట్టు సింగ‌రేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement