Friday, May 3, 2024

SI రాత పరీక్ష ప్రారంభం

పెద్దపల్లి : SI ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రారంభమయింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయిన రాత పరీక్ష కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 1719 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో 492 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 492 మంది, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో 735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. రాత పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ను పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు.

నర్సంపేట…
వరంగల్ జిల్లా నర్సంపేట లో SI రాత పరీక్ష ప్రారంభమైంది. ఎస్సై పరీక్ష రాసే అభ్యర్థులకు పలు సూచనలు సలహాలను పోలీస్ అధికారులు దగ్గరుండి సూచించారు. నర్సంపేట లో పోలీసులు 20సెంటర్లు ఏర్పాటు చేయగా 10188 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్న సుమారు 150 మంది పోలీసులు ఎస్సై పరీక్ష బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

మెదక్ జిల్లా…
మెదక్ జిల్లాలో SI రాత పరీక్ష కోసం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్సాపూర్ లో మూడు, పరీక్షా కేంద్రాలు, మెదక్ లో ఒకటి, రామాయంపేట లో ఒకటి మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2342 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement