Monday, April 29, 2024

సర్వర్ ప్రాబ్లమ్ తో SBI బ్యాంక్ సేవలకు అంతరాయం

అతిపెద్ద బాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ ప్రధాన బ్రాంచ్ తో పాటు పలు బ్యాంకులలో సోమవారం సేవలను నిలిపివేశారు. మార్చ్ ఎండింగ్ అనంతరం శని, ఆదివారాలు బ్యాంకును మూసి ఉంచడంతో సోమవారం కొత్త సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నించగా సర్వర్లు మొరాయించాయి. దీంతో బాంక్ సేవ‌లు నిలిపివేశారు. ఎక్కువ మంది ఉద్యోగుల జీతాలు ఎస్బిఐ అకౌంట్ లో జమ అవుతుంటాయి. బ్యాంకును మూసివేయడంతో ఖాతాదారు బ్యాంకు చుట్టూ తిరిగి వెనుతిరిగారు. తొలుత డేటా చోరీ జరిగినట్టు ప్రచారం జరగగా అదేమి లేదని సర్వర్ ప్రాబ్లమ్ వల్ల సమస్య తలెత్తిందని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement